హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించి, అకడి నీళ్లను కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ల బరాజ్‌కు తరలించాలని ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైంది. తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని కాంగ్రెస్ సరారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. మరోవైపు మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యత అంశాలను పరిగణనలోకి తీసుకొని కేసీఆర్ సరార్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. ఈ ప్రాజెక్టును కాళేశ్వరం, వార్ధా ప్రాజెక్టులుగా రూపకల్పన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించింది. కానీ కొద్దిపాటి సాంకేతిక కారణాలను చూపుతూ కాంగ్రెస్ సరారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును పకన పెట్టి మళ్లీ తుమ్మిడిహట్టి బరాజ్‌ను తెరమీదకు తీసుకొచ్చింది.
తుమ్మిడిహట్టి వద్ద నెలకొన్న సాంకేతిక కారణాల నేపథ్యంలో దానికి దిగువన 9 కిలోమీటర్ల వద్ద బోరేపల్లి వద్ద బరాజ్‌ను నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బందులుండవని ఇరిగేషన్ శాఖ గతంలోనే ఓ ప్రతిపాదన చేసింది. దాంతోపాటు తాజాగా తుమ్మిడిహట్టి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించి.. సుందిళ్లకు, అకడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు అవకాశముందని అధికారులు మరో ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చారు. మేడిగడ్డ అందుబాటులోకి వచ్చేవరకూ ప్రాణహిత నుంచే నీటిని వాడుకోవచ్చనే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే తుమ్మిడిహట్టి వద్ద ఎడమవైపు టైగర్ రిజర్వ్ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. వాటితోపాటు మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా ఇరిగేషన్ శాఖ కసరత్తు చేస్తున్నది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదించేందుకు సైతం సిద్ధమైంది.