హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై (Private travels bus) రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. పండుగ వేళ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను సీజ్చేస్తున్నారు. ఇందులో భాగంగా నగర శివార్లలోని పెద్ద అంబర్పేట రింగు రోడ్డు వద్ద ఆర్టీవో అధికారులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని మూడు ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు.
శంషాబాద్లో కూడా రెండో రోజు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని ఆరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేశారు. రూల్స్ అతిక్రమస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.