నిర్మల్ అర్బన్ ఏప్రిల్ 24 నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి ముడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డిపో కార్యాలయం ఎదుట ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికుల పక్షాన పోరాడుతూ ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించారు.
రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆర్టీసీ కార్మికులు గత మూడు రోజులుగా తమ సమస్యల పరిష్కరించాలని నిరసన చేస్తున్న ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే సమ్మెను మరింత ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయా యూనియన్ల నాయకులు ఉన్నారు.