ఆర్టీసీ సమ్మె అనివార్యం!.. కార్మికులతో చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం విముఖత
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలతో చర్చలు జరుపకుండా ప్రభుత్వం తాత్సా రం చేస్తున్నదా? చర్చలకు గేట్లు తెరిచే ఉన్నాయని చెప్తూనే సమ్మెను ప్రోత్సహిస్తున్నదా? అంటే అవునన్న సమాధాన మే వస్తున్నది.
- కార్మికులకు పలు వర్గాల మద్దతు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో సమ్మె కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలతో చర్చలు జరుపకుండా ప్రభుత్వం తాత్సా రం చేస్తున్నదా? చర్చలకు గేట్లు తెరిచే ఉన్నాయని చెప్తూనే సమ్మెను ప్రోత్సహిస్తున్నదా? అంటే అవునన్న సమాధాన మే వస్తున్నది. తమను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు వెళ్తున్న కార్మికులను సర్కార్ కనీ సం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడంలేదు.
ఆర్టీసీ కార్మికులంతా సమ్మెకు వెళ్లాలనే దృఢనిశ్చయంతో ఉన్నారని ఇం టెలిజెన్స్ నుంచి సమాచారం ఉన్నా ప్ర భుత్వం తాత్సారం చేస్తున్నది. హక్కుల సాధన కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు చెప్తున్నారు.
రేపు అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్
ఆర్టీసీ కార్మికులు 22 నుంచి సమ్మెకు వెళ్తుండటంతో 21వ తేదీ అర్ధరాత్రి నుంచే మొదటి డ్యూటీ బస్సులు ఆగిపోనున్నాయి. హక్కుల సాధన కోసం సమ్మెకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికులకు పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ తెలంగాణ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదివారం యాజమాన్యానికి లేఖ రాసింది. ఆర్టీసీ కనుమరుగైతే సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు సహా అన్ని వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ లేఖలో పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

