మెదక్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : మెదక్(Medak) ఆర్టీసీ డిపో నుంచి తెల్లవారుజామున బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నం చేయగా కార్మికులు(RTC workers) అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య బస్సులు నడిపేందుకు డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సులు తీసుకురాగా కార్మికులు సమాచారం తెలుసుకొని భారీ సంఖ్యలో చేరుకొని అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు కార్మికులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మెదక్ ఆర్టీసీ డిపో వద్ద భారీ సంఖ్యలో పోలీసులు చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీలో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నం చేస్తుండడంతో కార్మికులు అడ్డు చెప్పగా పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లను కండక్టర్లను నియమకం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.