హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో 10వ తేదీ దాటినా వేతనాలు అందకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘జీతాలివ్వండి సారూ’ అంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో లాభాలు వ చ్చాయని యాజమాన్యం, ప్రభుత్వం ఊదరగొట్టినా ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది.
అయితే ఆయాజో న్ల వారీగా వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం.. అన్ని విభాగాల కార్మికులకు ఒకేసారి వేతనాలు ఇవ్వడంలేదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. మెకానిక్ క్యాడర్ వరకు వేతనాలు ఇచ్చి, కిందిస్థాయి వారిని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కాకపోవటంతో జీతాలు చెల్లించటం ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది. సంస్థలో నిధులులేక, అందరికీ ఒకేసారి జీతాలు చెల్లించే పరిస్థితి లేకపోవటంతో విడతల వారీగా వేతనాలు ఇస్తుండటం చర్చ నీయాంశంగా మారింది.