హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రజాభవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని చెప్పారు.
పీఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ప్రకటించారు. కాగా, మార్చి వరకు 3,233 కండక్టర్ పోస్టుల అవసరం ఉందని, తాతాలికంగా నియామకాలతో పాటు 50 శాతం రెగ్యులర్ రిక్రూట్మెంట్కు అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ఈ సందర్భంగా డిప్యూటీసీఎంను కోరారు.
సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జాయింట్ ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఎంజేపీ కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.