హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ సిబ్బంది పలు ఇబ్బందులను ఎదురొంటున్నారు. ఈ పథకం అమలుకు విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టికెట్లు తీసుకున్న పురుషులు, నెల మొత్తానికి నగదు చెల్లించి బస్ పాస్ తీసుకున్న వారు బస్సుల్లో నిల్చొని ప్రయాణిస్తూ సిబ్బందితో వివాదాలు పెట్టుకుంటున్నారు. ఉచితమే కదా అని.. ఆధార్ కార్డుతో బస్సు ఎక్కి, గమ్యస్థానం చేరకముందే మధ్యలోనే మహిళలు దిగిపోతున్నారు. దీంతో గమ్యస్థానం చేరుకునే సరికి టికెట్ తీసుకున్న మహిళలు బస్సులో లేక ఆర్టీసీ అధికారుల ప్రశ్నలతో కండక్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.