హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : విధి నిర్వహణలో మానవత్వం చాటిన సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ బస్‌భవన్‌లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి మణుగూరు డిపో డ్రైవర్ కోటేశ్వర్రావు, గద్వాల్ డిపో కండక్టర్ కిశోర్‌కుమార్, డ్రైవర్ నరేందర్‌గౌడ్, జగిత్యాల డిపో మేనేజర్ సునీతను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సతరించారు. కార్యక్రమంలో సీవోవో రవీందర్, ఈడీలు మునిశేఖర్, ఖుస్రోషాఖాన్, రాజశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, హెచ్వోడీలు విజయభాసర్, వెంకన్న, శ్రీదేవి, ఉషాదేవి పాల్గొన్నారు.
గతేడాది డిసెంబర్ 21న మణుగూరు డిపోకు చెందిన బస్సులో ఓ ప్రయాణికురాలి 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె డ్రైవర్ కోటేశ్వర్రావుకు చెప్పింది. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్.. బస్సును భద్రాచలం బస్‌స్టేషన్‌లో నిలిపి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి బస్సులోని ప్రయాణికులను తనిఖీచేసి ఆభరణాలు అపహరించిన మహిళను పోలీసులకు అప్పగించారు. బంగారు ఆభరణాలను పోలీసులు ప్రయాణికురాలికి అప్పగించారు. దీంతో డ్రైవర్ కోటేశ్వర్‌రావును డిపో డీఎం, ఆర్టీసీ సిబ్బంది అభినందించారు.
జనవరి 2న గద్వాల డిపోకు చెందిన బస్సులో ఓ గర్భిణికి ఒకసారిగా పురిటినొప్పులు వచ్చాయి. విషయాన్ని గమనించిన కండక్టర్ కిశోర్‌కుమార్.. డ్రైవర్ నరేందర్‌గౌడ్‌కు తెలిపారు. వెంటనే బస్సును పకకు ఆపి..108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పురుడుపోశారు.
జనవరి 12న జగిత్యాల బస్‌స్టేషన్‌లో ఓ ప్రయాణికురాలికి గుండెపోటు వచ్చింది. అకడే విధులు నిర్వహిస్తున్న డీఎం సునీత వెంటనే అప్రమత్తమై ఆమెకు సీపీఆర్ చేశారు. అనంతరం 108 సాయంతో జగిత్యాల ప్రభుత్వ దవాఖానలో చేర్చించారు. డీఎం సకాలంలో స్పందించడంతో ప్రయాణికురాలికి ప్రాణాపాయం తప్పింది.