Rakhi Festival | రాఖీకి స్పెషల్ బాదుడు షురూ.. 30-50 శాతం చార్జీలు అదనం!
Rakhi Festival | రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బాదుడు షురూ చేసింది. ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5వేల ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం తెలిపారు.
Rakhi Festival | హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బాదుడు షురూ చేసింది. ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5వేల ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం తెలిపారు.
ఆగస్టు 26న మిలాద్-ఉన్-నబీ, ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 30న ఆదివారం సెలవు రావడంతో పండుగకు ముందే ప్రయాణికుల రద్దీ ప్రారంభమవుతుందని, తిరుగు ప్రయాణాల రద్దీ ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉన్నదని మంత్రి తెలిపారు.
ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు సవరించామని, దూరాన్నిబట్టి 30 -50 శాతం పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని ఆర్టీసీవర్గాలు తెలిపాయి. ‘స్పెషల్ బస్’ అని రాసిలేని బస్సుల్లో అదనపుచార్జీలు వసూలు చేస్తే ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

