GHMC Labourers | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ప్రతీ రోజు ఎక్కడ చూసినా ఏదో ఒక ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళన చేయగా.. కొన్ని రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా రేవంత్ సర్కార్ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని ఆందోళన కొనసాగిస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ కార్మికులు కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పారు.
చెత్త సేకరణ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులు అసెంబ్లీని ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఓ వైపు జీహెచ్ఎంసీ కార్మికులు గో బ్యాక్ గో బ్యాక్ ఖాకీ గో బ్యాక్.. కార్మికుల ఐక్యత వర్థిల్లాలి.. అంటూ నినాదాలు చేస్తుంటే మరోవైపు పోలీసులు వారిని బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ఈ వీడియో కండ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
అసెంబ్లీని ముట్టడించిన జీహెచ్ఎంసీ కార్మికులు
చెత్త సేకరణ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన
అడ్డుకుని కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/X6PS4Zs6Pi
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026