న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి చెందిన ముగ్గురు పైలట్లు(IAF Pilots) బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యువ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వేల్స్‌లోని ఆర్ఏఎఫ్ వ్యాలీలో ఆ ట్రైనింగ్ కేంద్రం ఉన్నది. క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా ఐఏఎఫ్ పైలట్లు ఆర్ఏఎఫ్లో చేరారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు ఇండియన్ పైలట్లు శిక్షణ ఇవ్వడం వందేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. రెండేళ్ల పాటు ఆ ముగ్గురు అక్కడ శిక్షణ ఇస్తారు. ఆ ముగ్గురి పైలట్ల ఫోటోను ఐఏఎఫ్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది.
భారత్, యూకే సంబంధాలు ఇది కొత్త మైలురాయి అని ఐఏఎఫ్ పేర్కొన్నది. స్వ్కాడ్రన్ లీడర్ స్థాయి ఆఫీసర్ నాయకత్వం వహిస్తున్నారు. బీఏఈ హాక్ టీ2 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. భారత్‌లోనూ ఫైటర్ పైలట్ల శిక్షణ కోసం ఇదే విమానాన్ని వినియోగిస్తుంటారు.
1932లో రాయల్ ఎయిర్ ఫోర్స్ తొలిసారి భారతీయ మిలిటరీ పైలట్లకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు దాదాపు వందేళ్లు సమీపిస్తున్న తరుణంలో భారతీయ పైలట్లు బ్రిటన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడం గమనార్హం.
🇮🇳🤝🇬🇧 A historic first in India–UK defence cooperation.
Three Indian Air Force Qualified Flying Instructors (QFIs) have joined RAF Valley, Wales, to instruct Royal Air Force pilots — marking the first deployment of Indian QFIs to the UK.
A landmark step in strengthening our… pic.twitter.com/9v9jdUXoB3
— Indian Air Force (@IAF_MCC) September 11, 2026