హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశించారు. గురువారం రీజినల్ మేనేజర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తకువ ఆదాయం వస్తున్న మార్గాల్లో రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు నెలలో నాలుగుసార్లు ప్రయాణించి కారణాలను విశ్లేషించాలని సూచించారు. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు రూపొందించాలని పేర్కొన్నారు. ప్రజా రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు.