IND vs NAM : పొట్టి ప్రపంచకప్‌లో యూఎస్ఏపై స్వల్ప తేడాతో నెగ్గిన భారత్.. రెండో మ్యాచ్‌లో పంజా విసిరింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు రెఢీ అంటూ టాప్ గేర్ ఆటతో నమీబియాను చిత్తు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(61) ఊచకోతకు, హార్దిక్ పాండ్యా(52)ల మెరుపులు తోడవ్వగా.. ప్రత్యర్థికి 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా 93 పరుగుల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో ఓపెనర్లు దూకుడుగా ఆడినా.. వరుణ్ చక్రవర్తి(3-7) ఒకే ఓవర్లో రెండు వికెట్లతో ప్రత్యర్ధిని దెబ్బకొట్టాడు. చివరి బ్యాటర్ గ్రీన్ షాట్ ఆడబోగా వికెట్లకు తాకడంతో టీమిండియా పొట్ట కప్‌లో వరుసగా పదో విజయం నమోదు చేసింది.
ఆతిథ్య భారత జట్టు ప్రపంచకప్‌లో అదిరే ప్రదర్శన చేసింది. యూఎస్ఏపై తేలిపోయిన టాపార్డర్.. ముఖ్యంగా ఓపెనర్ఇషాన్ కిషన్(61) నమీబియాపై పిడుగల్లే విరుచుకుపడగా.. హార్దిక్ పాండ్యా(52) విధ్వంసంతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. అనంతరం బంతితో వరుణ్ చక్రవర్తి(3-7) మ్యాజిక్ చేయగా ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. బ్యాటుతో మెరిసి, రెండు వికెట్లు తీసిన పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 93 పరుగుల విజయంతో ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు మేము రెఢీ అని హెచ్చరికలు పంపింది టీమిండియా.
Biggest win margin for #TeamIndia by runs in ICC Men’s #T20WorldCup 💪
The #MenInBlue beat Namibia by 9️⃣3️⃣ runs to make it 2️⃣ victories in a row!
Scorecard ▶️ https://t.co/SQLoaZjq98#INDvNAM pic.twitter.com/b0PL2LLSbI
— BCCI (@BCCI) February 12, 2026
టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనను నమీబియా ఓపెనర్లు దూకుడగా ఆరంభించారు. లోరెన్ స్టీన్కాంప్(29), జన్ ఫ్రైలింక్(22)లు భారత పేసర్లను ఒత్తిడిలో పడేస్తూ బౌండరీలతో చెలరేగారు. ఈ జోడీని అర్ష్‌దీప్ సింగ్(1-36) విడదీసి తొలి బ్రేకిచ్చాడు. కానీ, వరుణ్ చక్రవర్తి మలుపు తిప్పాడు. 10వ ఓవర్లో రెండు వికెట్లు తీసి నమీబియాను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో కెప్టెన్ ఎరాస్మస్ (18) ఔటయ్యాడు.
Castled ⚡️⚡️
Jasprit Bumrah gets on the wicket-taking charts with a pinpoint yorker 🔥
Updates ▶️ https://t.co/SQLoaZjq98#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvNAM | @Jaspritbumrah93 pic.twitter.com/yj9Rna8QKF
— BCCI (@BCCI) February 12, 2026
అక్షర్ పటేల్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతడు..ఈసారి మరోషాట్కు యత్నించి తిలక్ వర్మ చేతికి చిక్కాడు.. అంతే.. 88కే ఐదు వికెట్లు పడ్డాయి. బుమ్రా డైవింగ్ క్యాచ్‌తో మలన్ కుర్గర్(5)ను పెవిలియన్ పంపగా అప్పటికే నమీబియా ఓటమి ఖాయమైంది. కాసేపు ప్రతిఘటించిన రూబెన్ ట్రంపుల్మన్(6)ను బుమ్రా బౌల్డ్ చేయగా.. హార్దిక్ తన చివరి ఓవర్లో వరుసగా ఇద్దరిని ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. చివరి బ్యాటర్ గ్రీన్ షాట్ ఆడబోగా వికెట్లకు తాకడంతో టీమిండియా పొట్ట కప్‌లో వరుసగా పదో విజయం నమోదు చేసింది. ఈ ఎడిషన్‌లో రెండో విజయంతో సూర్యకుమార్ సేన గ్రూప్ ఏ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
పొట్టి ప్రపంచకప్ ఆరంభ పోరులో తేలిపోయిన భారత బ్యాటర్లు నమీబియాపై ఉతికేశారు. ఓపెనర్ ఇషాన్ కిషన్(61) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి ప్రత్యర్ధి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు.. మెరుప అర్ధశతకంతో భారీస్కోర్‌కు పునాది వేసిన ఇషాన్ ఔట్‌కాగానే.. మిడిలార్డర్ అతడిని అనుసరించారు. అయితే.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(52), శివం దూబే(23)లు తమ స్టయిల్ మెరుపులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఆఖరి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు పడడంతో 208కే టీమిండియా పరిమితమైంది. లేదంటే.. 220 పైగా స్కోర్ చేసేది.