ప్రభుత్వ పరిధిలోనే ఆర్టీసీ విలీనం.. వాహన్ పోర్టల్ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమవంతు పాత్ర పోషించారని, వారి చిరకాల డిమాండ్ అయిన విలీన అంశం, గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు.
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమవంతు పాత్ర పోషించారని, వారి చిరకాల డిమాండ్ అయిన విలీన అంశం, గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. మహాలక్ష్మీ పథకం విజయవంతంలో డ్రైవర్లు, కండక్టర్లకు కొంత పనిభారమైన విషయం వాస్తవమేనని, వారి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. రవాణాశాఖ మంత్రిగా ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉంటానని చెప్పారు. సోమవారం బేగంపేటలోని వరుణ్ మోటర్స్ వద్ద ‘వాహన్’ పోర్టల్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రెండో వాహనం కొనుగోలు చేస్తున్న వారికి వాహన పన్ను రద్దు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 15 చెక్‌పోస్టులు ఎత్తివేశాం. రవాణాశాఖ ఈవీ పాలసీ, స్రాప్ పాలసీ తీసుకొచ్చింది. వాహన్ పోర్టల్‌లో చేరడంతో వాహన రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, పన్నుల చెల్లింపు వంటి సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి’ అని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు చంద్రశేఖర్‌గౌడ్, రమేశ్, శివలింగయ్య, ఎన్ఐసీ ప్రతినిధి జగదీప్, వరుణ్ మోటర్స్ అధినేత వరుణ్, డీటీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘వాహన్’తో కలిగే ప్రయోజనాలు..
- దేశవ్యాప్తంగా ఒకే నెట్వర్(వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్) ఉంటుంది. రాష్ట్రంలోని వాహనాల వివరాలన్నీ జాతీయస్థాయి డాటాబేస్‌తో అనుసంధానమవుతాయి. దీనివల్ల దేశంలో ఎకడైనా వాహన వివరాలను క్షణాల్లో తనిఖీ చేయవచ్చు.
- వాహన యాజమాన్యం మార్పిడి(ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్), చిరునామా మార్పు సులభతరం అవుతాయి.
- పన్నులు, ఫీజులు, ఇతర చార్జీలను ఆన్లైన్లో ఎకడి నుంచైనా చెల్లించే అవకాశం ఉంటుంది.
- ఎక్కడి నుంచైనా వాహనం తీసుకొచ్చినా లేదా ఇకడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లినా ఎన్వోసీ, రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీ అవుతుంది.
- వాహనం చోరీకి గురవుతే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర పోలీసులైనా ఆ వాహన నంబర్ ద్వారా అసలు యజమానిని గుర్తించవచ్చు.
- ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పీయూసీ వివరాలు ఆటోమెటిక్‌గా అప్డేట్ అవుతాయి. నకిలీ పత్రాలకు చెక్ పెట్టవచ్చు.
- వాహన్ పోర్టల్ అనుసంధానంతో ఆర్సీ, ఇతర పత్రాలను డిజిటల్ లాకర్, ఎంపహిల్వాన్ యాప్‌లలో అధికారికంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు ఫిజికల్ కార్డ్ చూపించాల్సిన అవసరం ఉండదు.
- మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పోర్టల్ ద్వారా పనులు చేసుకోవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

