నేటి నుంచి ప్రత్యేక స్కూల్ బస్సులు
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ సిద్ధంగా ఉన్నదని, అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు.
- విద్యార్థుల వేళలకు అనుగుణంగా నడుపాలి: ఆర్టీసీ ఎండీ ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ సిద్ధంగా ఉన్నదని, అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రూట్లలో తగినన్ని బస్సులు నడుపాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సూళ్ల వేళలకు అనుగుణంగా బస్సులు నడుపాలని, గతంలో నడిపిన అన్ని రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టంచేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎకువ సమయం వేచి చూడకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో సమయపాలన కచ్చితంగా పాటించాలని, అవసరమైనచోట అదనపు ట్రిప్పులు నడుపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని నాగిరెడ్డి ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

