అందోల్, నవంబర్ 29 : సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో శుక్రవారం ఆర్టీసీ అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం 55మంది ప్రయాణికులతో లింగంపల్లి బయల్దేరింది. 161 జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో కన్సాన్పల్లి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందుకు వెళ్లి కిందకు పడితే పెద్ద ప్రమాదమే జరిగేదని, డివైడర్‌పై ఆగడం తో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెప్పారు.