RTC | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 18: బీసీల బంద్‌తో ఆర్టీసీకి సుమారు కోటి రూపాయాలకు వరకు నష్టం వాటిల్లింది. 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు నిర్వహించిన బంద్‌తో బస్సులన్నీ హనుమకొండ బస్ స్టేషన్‌కు పరిమితయ్యాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్ని బస్టాండ్ల్లోనే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. తెల్లవారుజాము నుంచే డిపోల నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీకి ప్రతిరోజు సుమారు రెండు కోట్లకుపైగా ఆదాయం వచ్చేది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్సులను నడిపించకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీకి సుమారు కోటి వరకు నష్టం జరిగినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ డి.విజయభాను తెలిపారు.