హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జేఏసీ భాగస్వామ్య సంఘాలైన ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ, బీకేయూ బీడబ్ల్యూ, కేపీ సంఘాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 11గంటలకు జరిగే ఈ అత్యవసర సమావేశంలో పలు అంశాలపై చర్చించాల్సి ఉన్నదని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపి.. లేబర్ కమిషన్‌తో జరిగే చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం డుమ్మా కొట్టేందుకు సిద్ధమైందని ఆరోపించారు.