దూరప్రాంత ప్రయాణికులకు ఆర్టీసీ రాయితీ
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాయితీ ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
- లహరి బస్సులు తిరిగే రూట్లలో 10 శాతం రాయితీ
- వేసవి ప్రత్యేకంగా టీఎస్ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాయితీ ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిసౌంట్ను కల్పించనున్నది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.
ఏప్రిల్ 30 వరకు ఈ డిసౌంట్ ఆఫర్ అమలులో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తున్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు, గోదావరిఖని-బెంగళూరు, కరీంనగర్-బెంగళూరు, నిజామాబాద్-తిరుపతి, నిజామాబాద్-బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

