ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలు అద్భుతం : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్వర్యంలో రెండేళ్లుగా కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వినియోగదారులకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ కరోనా వల్ల మరింత కష్టాల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఇతర మార్గాలను అన్వేషించి పార్సిల్, కొరియర్, కార్గో సేవలను జూన్ 19, 2020న ప్రారంభించామని వెల్లడించారు.
పార్సిల్ సర్వీసులతో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు వెళ్లే అన్ని ప్రాంతాలకు సేవలు అందుబాటులోకి వచ్చాయని అజయ్‌కుమార్ తెలిపారు. గతంలో ఆర్టీసీ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పార్సిల్- కొరియర్ సేవలను నిర్వహించేదని, ప్రస్తుతం ఆర్టీసీ సొంతంగా ఈ సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు. కార్గో, పార్సిల్ సేవల ద్వారా ఆర్టీసీ రెండేళ్లలో రూ.120.52 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని వెల్లడించారు. ఇప్పటి వరకు పార్సిళ్ల బట్వాడా ద్వారా రూ.88.68 కోట్లు, కార్గో రవాణా ద్వారా రూ.31.84 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. ఆర్టీసీ ప్రత్యేకంగా ఇంటింటికీ సేవలను ప్రారంభించిందని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కార్గో సేవలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని నగరాలకూ విస్తరించామని చెప్పారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

