పరిగి, మార్చి 14: వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన అద్దె బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్‌నగర్ బయలుదేరింది. పరిగి శివారు దాటిన తర్వాత బస్సు డ్రైవర్ టికెట్ల కోసం రోడ్డు పక్కన నిలిపే ప్రయత్నం చేస్తుండగా.. మట్టిలోకి టైర్లు దిగబడటంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ బస్సులో 90 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వారిలో సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పరిగి ఎస్సై సంతోష్‌కుమార్ సిబ్బందితో వచ్చి క్షతగాత్రులను అంబులెన్స్‌లో పరిగి దవాఖానకు తరలించారు.