RTC Bus Accident | కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్‌తో నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్‌లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కాగా, శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నందునే ప్రమాదం జరిగిందని ప్రయాణికుల ఆగ్రహం
కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా,… pic.twitter.com/OlW3Fqxo9J
— Telugu Scribe (@TeluguScribe) April 22, 2026