Road Accident | కారేపల్లి: ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఇల్లెందు ఖమ్మం ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కొత్త లింగాల ముచ్చర్ల మార్గమధ్యలో ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్, ఆటో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ సోందుబి (68) అక్కడికక్కడే మృతి చెందింది. కారేపల్లి మండల పరిధిలోని గాదిపాడు అంగన్వాడీ టీచర్ షేక్ మహబూబి తీవ్రంగా గాయపడ్డారు. టీచర్ షేక్ మహబూబి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అదేవిధంగా ఆటో డ్రైవర్ సలీంతో పాటు ప్రయాణికులు కమల, షేక్ అలీమాలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కామేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.