TGSRTC | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) బస్టాండ్లలో వ్యాపార ప్రకటనలు ప్రదర్శించుకునేందుకు ఆసక్తికల్గిన సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. రంగారెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, జేబీఎస్, మహాత్మాగాంధీ బస్స్టేషన్లలో వ్యాపార ప్రకటనలు ప్రదర్శించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 5 వరకు టెండర్ దరఖాస్తులను సమర్పించాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.