హైదరాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ వైఫల్యాల ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎండగట్టారని, ఇందుకు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండ దు.. అంటూ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మోదీని ఉద్దేశించి చేసినవేనని అనుకుంటున్నారని తెలిపారు. మోదీ మ్యాజిక్కు కూడా పరిమితులు ఉండాలని సంఘ్ అధికార పత్రికలో కథనాలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పాత వారికే పాత శాఖలు కేటాయించి మోదీ తన అశక్తతను ప్రకటించుకున్నారని విమర్శించారు. చంద్ర బాబు, నితీశ్ ఎక్కువకాలం మోదీతో పని చేయలేరని అభిప్రాయపడ్డారు.