హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-4 అభ్యర్థులకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ పెట్టాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఉన్నతోద్యోగాలను తొలుత భర్తీ చేయాలని, లేనిపక్షంలో 4 వేల మంది అభ్యర్థులు రోడ్డున పడే ప్రమాదం ఉందని తెలిపారు. బ్యాక్లాగ్ పో స్టులు ఉండవని ఎన్నికల సమయంలో కాం గ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని వి మర్శించారు.
తెలంగాణభవన్‌లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, రంగినేని అభిలాశ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రూల్-6లో చట్టసవరణ చేస్తే అభ్యర్థులు అన్విల్లింగ్ ఆప్షన్ పెట్టుకోవచ్చని చెప్పారు. గ్రూప్-4 పోస్టుల భర్తీలో కూడా అన్విల్లింగ్ ఆప్షన్ పెట్టుకుంటే 3 నుంచి 4 వే ల మందికి న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు.
జీవో 29కి వ్యతిరేకంగా గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారని, వారికి మద్దతుగా బీఆర్ఎస్ సుప్రీంకోర్టు వరకు వె ళ్లిందని తెలిపారు. గ్రూప్-4లో 8 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. హోంశాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్ శాఖపై శ్రద్ధచూపడం లేదని మండిపడ్డారు.