RS Praveen Kumar | తెలంగాణ క్యాబినెట్లోనే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి, మంత్రులకు మధ్య సయోధ్య లేదు అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై సీఎం నిర్వహించిన ప్రెస్ మీట్‌పై ఆయన స్పందించారు. నిన్న(సోమవారం) రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిందని ఆఘమేఘాల మీద సమావేశం నిర్వహించారు. కానీ, మీడియా సమావేశంలో కూర్చున్న 10 నిమిషాల తర్వాత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీలో ఉండి కూడా, రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెడితే మంత్రులు సమయానికి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే వారి మధ్యలో ఉన్న సఖ్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
తెలంగాణ క్యాబినెట్లోనే ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య సయోధ్య లేదు
నిన్న రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో కూర్చున్న 10 నిమిషాల తర్వాత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు
సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీలో ఉండి కూడా, రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెడితే మంత్రులు సమయానికి… pic.twitter.com/Hs2NFHTD6t
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026