Loan Waiver | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెక్కినట్టేనా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. రైతులకు పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు కావాలంటే, పాత అప్పు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారని గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు.. మీకు డిసెంబర్ 9 గుర్తుందా? లేదా? అధికారం మత్తులో మునిగి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలులో పడి ఆ తేదీ, రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ మరిచిపోయారా? అధికారం దకగానే ప్రజలకిచ్చిన హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వాటిని తుంగలో తొకుతున్న కాంగ్రెస్ సర్కారు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.
ఒక ఫ్యూడల్ భూస్వామ్య కులం చెరబట్టింది
స్వాతంత్య్రాన్ని తెచ్చి జాతిని విముక్తం చేసిన మూడురంగుల జెండాను నేడు ఒక తెలంగాణ ఫ్యూడల్ భూస్వామ్య కులం చెరబట్టిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బక్క జడ్సన్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడంపై ఆయన ఎక్స్ వేదికగా గురువారం స్పందించారు. ‘జడ్సన్ రాయని కవిత’ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నాడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన చేతులే, నేడు అన్యాయమని ఎలుగెత్తిన గొంతులను బహిషరిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త… తగిన మూల్యం చెల్లించుకుంటారు?’ అని హెచ్చరించారు. ‘కాంగ్రెస్‌లో ఇంకా సామాజిక న్యాయం మిగిలి ఉందని నమ్మి అందులో బందీలైన కొంత మంది అమాయక ప్రాణులకు, అజ్ఞాన మేధావులకు ఈ కవిత కనువిప్పు కలిగిస్తుందనుకుంటా’ అని పేర్కొన్నారు. ‘ఒక బకోడైన బక జడ్సన్‌ను మీరు బహిషరించినమని సంబుర పడుతుర్రేమో.. మీరు గెంటివేసింది ముకోటి తెలంగాణ బహుజన ఆత్మలను, మీరు బహిషరించింది, మీకు అధికారం కట్టబెట్టిన సబ్బండవర్గాల తన్లాటను, రూమీ టోపీ నుంచి గాంధీ టోపీ దాకా ఆ నుంచి ఏ ఎండకాగొడుగు పట్టేదాకా సాగిన మీ ప్రయాణం కూచున్న కొమ్మనే నరికేసుకొనే మీ దుర్మార్గానికి తెగబడ్డది.. బాయిల బడ్డ కుక తీయబోయిన కరువొస్తదట.. అట్లున్నది మీ అభద్రత.. మీ కబంధ హస్తాల్లో చికిన కాంగ్రెస్‌ను ఎవ్వడూ కాపాడలేడిప్పుడూ’ అంటూ ఉన్న కవితను ప్రవీణ్ పోస్టు చేశారు.
ఇక నిర్ణయించాల్సింది ప్రజలే…
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్త్తామని బీజేపీ కీలక నేతలు బహిరంగంగానే చెప్తున్నారని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. నాగౌర్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధా చేసిన వ్యాఖ్యల వీడియోను ట్యాగ్చేస్తూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ వాళ్లకు ఓటు వేసి మనం చీకటియుగంలోకి పోవాలో లేదో నిర్ణయించుకోవాల్సింది దేశ ప్రజలేనని సూచించారు.