హైదరాబాద్: గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట కార్యక్రమం చేపట్టామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంతో కాంగ్రెస్‌కు వణుకు మొదలైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో దాదాపు ఏడాదిగా విద్యాశాఖకు మంత్రి లేరని, సంక్షేమ శాఖకు మంత్రి లేదరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గురుకులాలు ప్రమాదపుటంచులో ఉన్నాయన్నారు. నాణ్యమైన భోజనం కోసం విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖను తెలంగాణ ప్రజలు గతంలోనే తిరస్కరించారని చెప్పారు. మహిళలపై చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. గతంలో ఐపీఎస్ అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందన్నారు. ఏడేండ్ల సర్వీస్ వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లో వచ్చానని చెప్పారు. తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని సురేఖ చెప్పారని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. తనపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే సీబీఐ విచారణకు ఇవ్వాలన్నారు.
Live: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు @RSPraveenSwaero మీడియా సమావేశం. https://t.co/FNPJZey9sg
— BRS Party (@BRSparty) November 30, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యస్థను విధ్వంసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఇది రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అన్నారు. సీఎం రేవంత్ నయా దేశ్‌ముఖ్ అని దుయ్యబట్టారు. గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో చదివేవాళ్లంతా పేద బడుగు, బలహీన వర్గాల పిల్లలని తెలిపారు. రేవంత్ రక్తంలో అణువణువునా ఆధిపత్య భావజాలం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విద్య దక్కకుండా కుట్రలు చేస్తున్నారు. అందుకే విద్యా శాఖ, సంక్షేమ శాఖలను తన దగ్గర పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో 11 నెలల్లోనే 860 మంది విద్యార్థులు దవాఖానల పాలయ్యారు. 48 మంది విద్యార్థులు చనిపోగా, 23 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కార్పొరేట్ సంస్థలతో రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని రోపించారు. సీఎం సొంత జిల్లాలోని స్కూల్లో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ జరిగితే ఇప్పటివరకు సమీక్ష చేయలేదన్నారు. అధికార మదంతో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గురుకులాలు బాగుంటే తాము ప్రశ్నించే అవసరం ఏముందన్నారు.
కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దీక్షా దివస్ స్ఫూర్తిగా గురుకులాల బాట నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ మీద కోపంతో గురుకులాలను ధ్వంసం చేయొద్దు. బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దన్నారు. తాము పనిలో పోటీపడేవాళ్లమని, పైరవీల కోసం కాదన్నారు. అప్పుడు గురుకులాల్లో సీట్లు దొరకలేదని, ఇప్పుడు 40 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మంత్రి కొండా సురేఖ ఆరోపణలు దుర్మార్గంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బృందాలు విద్యాసంస్థల్లో అధ్యయనం చేస్తాయి. 33 జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో అధ్యం చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడుకునేందుకు పోరాడుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బృందాలకు ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి విభాగం అనేక పోరాటాలు చేసిందని, ఇప్పుడు దీక్షా దివస్ స్ఫూర్తితో విద్యాలయాల రక్షణకు పోరాడుతామన్నారు.
Live: BRS Leaders Press Meet at Telangana Bhavan
https://t.co/rslZDf3AxX— BRS Party (@BRSparty) November 30, 2024