హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): సినీనటుడు అల్లు అర్జున్‌కు ఒక న్యా యం? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మరో న్యా యమా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనకు ఒకలా, హుస్సేన్‌సాగర్ ఘటనకు మరోలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎం దుకు స్పందిస్తున్నదని నిలదీశారు. బీసీ బిడ్డ లు గణపతి, అజయ్ ప్రాణాలు.. రేవతి ప్రా ణాల విలువ ఒకటి కాదా? రేవంత్‌రెడ్డికి, బీజే పీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మధ్య అనుబం ధం ఏమిటి? అని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించా రు.
సంధ్య థియేటర్ కేసులో మహిళ చనిపోతే ఏ-11గా ఉన్న అల్లు అర్జున్ను జైలుకు పంపారని, అలాంటప్పుడు భారతమాత మ హాహారతి ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోతే ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. కిషన్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యుడు కారా? కిషన్‌రెడ్డి స్ఫూర్తితో నడుస్తున్న భారతమాత ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి పోలీస్ పర్మిషన్ తీసుకున్నదా? అని ప్రశ్నించారు.
‘ఈ ఘటనలో ఇంతవరకు ఒక నిందితుడిని కూడా ఎందు కు అరెస్టు చేయలేదు? హుస్సేన్‌సాగర్‌లోకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాంబు లు పేల్చడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఆ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. దీనికి టూరిజం అధికారుల అనుమతి ఉన్నదా? అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకున్నారా? సీఎంగా రేవంత్‌రెడ్డి ఈ ఘోర ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం, హోంమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై స్పందించాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.