RS Praveen Kumar | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ – బీఎస్పీ కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, నాగర్కర్నూల్ ఎంపీ నియోజకవర్గాలను బీఎస్సీకి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ పొత్తు ఖరారైన మరుసటి రోజే ఆర్ఎస్పీ రాజీనామా చేశారు.