హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్‌ను పోక్సో కేసు నుంచి తప్పించే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. బాలికపై లైంగికదాడి జరిగిందని బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితో పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ చేయడంలో ని ర్లక్ష్యం వహించారని చెప్పారు. ఆదివారం బా ధితురాలి తల్లితో మాట్లాడిన ఆర్ఎస్పీ, అనంతరం వీడియో విడుదల చేశారు. కేసుకు సం బంధించి కీలక విషయాలు వెల్లడించారు. తనను లైంగిక వేధించాడని స్వయంగా బాలి క వచ్చి పోలీసుల ముందు చెప్పిందని తెలిపా రు. బాధితురాలి తల్లితో ఆదివారం మధ్యా హ్నం 12గంటలకు మాట్లాడానని, బిడ్డకు న్యాయం జరుగాలని ఆ తల్లి పడే వేదన చూ స్తుంటే బాధ కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మే 8న సాయంత్రం 6.30 నుంచి 7 గంటల సమయంలో ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
అకడ కంప్లయింట్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి ఐదు గంటల స మయం పట్టింది. కంప్లయింట్లో ఉన్న కంటెంట్ మార్చాలని పోలీసులు ఒత్తిడి చేశా రు. ఇందులో పెద్దపెద్ద వాళ్లు ఉన్నారని బెదిరించారు. పెద్దపెద్ద వాళ్ల పేర్లు రాయొద్దని వా ర్నింగ్ ఇచ్చారు. చివరికి ఆ తల్లి ‘నా బిడ్డ, నేను కలిసి మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటాం’ అని భయపెడితే తప్ప కంప్లయింట్‌కు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. అప్పటికీ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ వారికి ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ వ చ్చిందో? రాలేదో? బాధితులకు తెలియదు. నే ను ఆ తల్లితో మాట్లాడిన తర్వాతే ఎఫ్ఐఆర్ డీ టెయిల్స్ తెలిశాయి’ అని వివరించారు. ఇది హోం మంత్రిగా ఉన్న రేవంత్ పాలనలో నా లుగు పాదాలపై నడుస్తున్న ధర్మమని మండిపడ్డారు. 2018లో ఎంజే అక్బర్ అనే మంత్రి పై ఆరోపణలు వస్తే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని, మరి ఇప్పుడు బండి సంజయ్‌ని ఎందుకు తప్పించలేదని మోదీని ప్రశ్నించారు.
బెట్స్ పెట్టుకొని ట్రాప్ చేసిన భగీరథ్
‘బండి సంజయ్ కొడుకు, అతడి స్నేహితులు సోషల్ మీడియాలో బెట్స్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లతో అందమైన అ మ్మాయిలను ఎలా పడేయాలి? వాళ్ల ఫొటోలు ఎలా రికార్డు చేయాలి అనేది మాట్లాడుకుంటారని బాలిక తల్లి చెప్పింది. ఇలాంటి వాళ్లతో అమ్మాయిలకు రక్షణ ఉంటుందా?’ అని ఆరెస్పీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘బెంగాల్లో అధికారంలోకి వచ్చాం.. తర్వాత తెలంగాణ అంటున్న సంజయ్ మాటలు వింటుంటే భయం వేస్తున్నది. దీనిని మహిళా మోర్చా ప్రతినిధులు ఎలా చూస్తరు’ అని ప్రశ్నించారు.
స్టేషన్ బెయిల్ వచ్చేలా కేసు
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురుపై లైంగికదాడి జరిగిందని ఫిర్యాదు చేసినా సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారని, స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చనే ఈ సెక్షన్ కింద నమోదు చేశారని ఆర్ఎస్పీ వివరించారు. ఆ తర్వాత బయటికి వచ్చి హైకోర్టులో కేసు నుంచి ఆంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొనే అవకాశం ఉన్నదని తెలిపారు. భగీరథ్‌ను కాపా డేందుకే సెక్షన్ 11 పెట్టారని, వాస్తవంగా బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు సెక్షన్ 8 ప్రకా రం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సా యంత్రం 7గంటలకు స్టేషన్‌కు బాధితురాలి తల్లి వెళ్లినా రాత్రి 12 గంటల వరకు ఎఫ్ఐఆర్ చేయలేదని తెలిపారు. వెంటనే ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉన్నా బాధితురాలిని కూడా నిందితురాలిగా చేర్చారని వాపోయారు.
సంజయ్‌ని బర్తరఫ్ చేయాలి
కేసు విచారణ సజావుగా జరుగాలంటే సంజయ్‌ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల ని ఆరెస్పీ డిమాండ్ చేశారు. రేవంత్, సంజయ్ ఒకరి స్కామ్‌లపై ఒకరు విచారణ జరుగకుండా కాపాడుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం తలుచుకుంటే నిందితుడు ఎక్కడ దాక్కున్నా బయటకు వస్తాడని చెప్పారు.
సంగప్పపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
లైంగికదాడి అంశాన్ని పక్కదారి పట్టించేందుకు హానీట్రాప్ పేరుతో బండి సంజయ్ పీఆర్వో పత్రికలు, మీడియా చానళ్లకు మెసెజ్‌లు పెట్టాడని ఆర్ఎస్పీ తెలిపారు. బాలికను బెదిరించిన సంగప్పపై ఎఫ్ఐఆర్ నమోదు చే సి, బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేశారు. ఏప్రిల్‌లో మాజీ జర్నలిస్టు, బీజేపీ నేత సంగప్ప బాధిత కుటుంబ దగ్గరికి వెళ్లి వారందిరినీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్లారని, వారిని సంజయ్ బెదిరించి పంపారని చెప్పారు. సంజయ్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు, ఫోన్ రికార్డు, సంగప్ప ఫోన్ డాటా, బాధితురాలి ఫోన్ డా టాను సేకరించి విచారణ జరుపాలని డీజీపీని కోరారు. భగీరథ్ చెప్పినట్టు నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో కక్షపూరితంగా బాలికపై తప్పుడు కేసు పెట్టిన అతడి స్నేహితుడు శ్రీరామ్‌పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సిట్ వేసి విచారణ జరుపాలి
డీజీ ర్యాంక్ మహిళా అధికారులతో సిట్ ఏర్పాటు చేసి కేసు విచారణ జరుపాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఆ పరిణామాలకు రేవంత్, బండి సంజయ్ బాధ్యత వహించాలని హెచ్చరించారు. పేట్ బషీరాబాద్ ఎస్సైని సస్పెండ్ చేయాలని, నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై సీఆర్పీసీ 164 కేసు నమోదు చేసే వరకూ వదిలి పెట్టేదే లేదని హెచ్చరించారు.
మోదీ గారూ.. మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి.. బేటీ బచావో అనే నినాదం మీ నోటి నుంచే వచ్చింది. కానీ ఈ దేశంలో మహిళలపై అడుగడుగునా అఘాయిత్యాలు జరుగుతున్నయ్. మీ క్యాబినెట్ మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైంది. ఆ కేంద్రమంత్రి మీ పకనే కూర్చున్నడు. మీ వేదిక ముందు వేలాది మంది తెలంగాణ మహిళలు కూర్చున్నరు. ఇప్పటివరకు బండి సంజయ్‌ని ఎందుకు బర్తరఫ్ చేయలే? ఈ దేశానికి మీరు ఏం సందేశం ఇస్తున్నట్టు?
-ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని స్వయంగా బాలిక వచ్చి పోలీసుల ముందు చెప్పింది. బిడ్డకు న్యాయం జరుగాలని ఆ తల్లి పడే వేదన చూస్తుంటే బాధ కలుగుతున్నది. ఈ దేశంలో న్యాయం ఇంత ఘోరంగా ఉంటుందా? చట్టం ఉన్న వాళ్లకు చుట్టంలా ఉంటదా? -ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్