హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శలు గుప్పించారు. ఉన్నతాధికారులను ఉత్సవ విగ్రహాల్లా మార్చారని మండిపడ్డారు. అటవీశాఖ విభాగాధిపతికి తెలియకుండా ఆ శాఖ అధికారులు విదేశాలకు వెళ్లడమే ఇందుకు నిదర్శనమని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సీఎంకు సమాచారం ఇవ్వకుండా మంత్రులు విదేశాలకు వెళ్తే సీఎం ఊరుకొనే వారా? అని నిలదీశారు. సీఎస్, డీజీపీ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఏసీ గదుల్లో కూర్చుంటున్నారా? కేటీఆర్, హరీశ్‌రావు మీద అక్రమ కేసులు, పీసీసీఎఫ్(ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) డొబ్రియాల్ను బైపాస్ చేసి అవమానించడాన్ని చూస్తే ఇది నిజమే అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. మీ దురాశకు, తప్పులకు అధికారులను బలిచేయడమెందుకు? అని ప్రశ్నించారు.