భగీరథ్‌ను అరెస్ట్చేశామని సీఎం చెప్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం తానే అప్పగించానని చెప్పుకొంటున్నరు. నిందితుడు అరెస్టయ్యాడా? లేక లొంగిపోయాడా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు సీఎం మాటలు నమ్మాలా? కేంద్ర మంత్రి మాటలను విశ్వసించాలా?
-ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును సర్కార్ పెద్దలు నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు తొమ్మిది రోజులు తా త్సారం చేశారని, ఇప్పుడు ఆయనను రక్షించేందుకు తంటాలు పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే నిందితుడిని పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. నిందితుడు దర్జాగా వచ్చి లొంగిపోయాడని, కానీ ప్రభుత్వ పెద్ద మాత్రం తామే అరెస్ట్‌చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేస్తే పక్కన పోలీసులు ఎందుకులేరని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. మీకు బాలికకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు చెప్పడం మాని.. సాక్షులను బెదిరించేలా మాట్లాడిన బండి సంజయ్, మధ్యవర్తిత్వం వహించిన సంగప్ప పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చాల’ని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. పోక్సో కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కస్టడీకి ఇవ్వాలని ఎందుకు కోరడంలేదని నిలదీశారు.
గురువారం ఆయన తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు కురువ విజయ్‌కుమార్, కల్వకుర్తి శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. భగీరథ్ అరెస్టు విషయంలో ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని, ఆయన జీవితమంతా అబద్ధాల చరిత్రేనని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు బాధితురాలి పేరు చెప్పారంటూ సీఎం అసత్యాలు చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ సోషల్‌మీడియా హ్యాండిల్స్‌ను పరిశీలించాలని సవాల్ విసిరారు. వాస్తవానికి బాధితురాలి వివరాలు బీజేపీ నేతలే బయటపెట్టారని, కరీంనగర్ టూటౌన్లో ఇచ్చి న ఫిర్యాదులో బాధితురాలితోపాటు ఆమె తల్లి పేరును కూడా రాశారని స్పష్టంచేశారు. వాస్తవాలు వెల్లడించిన తనపై అభాండాలు వేయ డం దుర్మార్గమని ఖండించారు. కాంగ్రెస్ ఎం పీ మల్లు రవి నిందితుడి తండ్రికి సానుభూతి తెలియజేయడం, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి బావామరదళ్ల సంస్కృతి అని చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ‘బీజేపీ నేతల్లా రా? ఇదే నా మీరు బాలికలపై చూపించే గౌర వం’ అని నిలదీశారు. రెండు పార్టీలు కుమ్మ క్కై బాలిక కుటుంబానికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మహిళా నేత లు, ఎన్ఎస్యూఐ నేతలు బీజేపీ ఆఫీసును ఎందుకు ముట్టడించలేదని ప్రశ్నించారు.
కేసీఆర్, కేటీఆర్ సూచనల మేరకే నిజాలు
కేసీఆర్, కేటీఆర్ సూచనల మేరకే తాను నిజాలను ప్రజలకు చెప్తున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ స్పష్టంచేశారు. ఆధారాలు చూపుతూ, బాధితురాలి తల్లి ఇచ్చిన సమాచారం ఆధారంగానే మాట్లాడుతున్నానని పునరుద్ఘాటించారు. కానీ అబద్ధాలు చెప్తున్న ముఖ్యమంత్రి మాత్రం బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. బండి భగీరథ్‌ను పట్టుకొనేందుకు మీరు వేసిన బృందాలు ఎక్కడ తిరిగాయో టవర్ లొకేషన్, నిందితుడి టవర్ లొకేషన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడిని సరెండర్ చేయించాలని సీఎం ఒక సహ నిందితుడిని బతిమాలడటం సిగ్గుచేటని పేర్కొన్నారు.
సిట్ ఎందుకు వేయలేదు?
‘ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం లాంటి కేసులపై సిట్ వేసిన సీఎం రేవంత్‌రెడ్డి మైనర్‌కు సంబంధించిన పోక్సో కేసులో సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఎందుకు ఏర్పాటుచేయలేదు. భగీరథ్ పోలీసులకు ఇచ్చిన మొబైల్ ఆయనది కాదని బాధితురాలి తల్లి చెప్తున్నది. ఫోన్లో సిమ్ లేదని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది.. దీనిపై హోంమంత్రిగా వ్యవహరిస్తున్న మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు’ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. రితిరాజ్ విచారణ అధికారి మాత్రమేనని స్పష్టం చేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం సిట్ వేసినట్టు నాటకాలాడిందని విమర్శించారు. అమ్మాయికి అన్యాయం చేసింది పోలీసులేనని, మే 16న అరెస్ట్ అయిన భగీరథ్‌ను ఇంతవరకు కస్టడీకి కోరకపోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టంచేశారు. సీఎం, బండి సంజయ్, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే బాధిత బాలికకు న్యాయం జరుగుతుందనే నమ్మకంలేదని పేర్కొన్నారు. పేట్‌బషీరాబాద్ ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్లో భగీరథ్‌తోపాటు అదర్స్ అంటే ఎవరు? బండి సంజయ్ కాదా? సంగప్ప కాదా? శ్రీరాం కాదా? ఆయన స్నేహితులు కాదా? అని ప్రశ్నించారు. బాధిత బాలికపై పుకార్లు ప్రచారం చేసిన బీజేపీ సోషల్‌మీడియాపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు.
మహిళా నేతల మౌనమేల?
ఒక బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ మహిళా నేతలు ఎందుకు స్పందించడంలేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. డీకే అరుణ, మాధవీలత, రచనారెడ్డి లాయైర్లెన రఘునందన్‌రావు, రాంచందర్‌రావు ఎందుకు పెదవులు విప్పడంలేదని నిలదీశారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పారు. సర్కార్ బెదిరింపులకు భయపడబోమని, నిందితుడికి శిక్ష పడేదాకా వెనుకడుగువేసిదిలేదని స్పష్టంచేశారు.
బండి భగీరథ్‌ను అరెస్ట్ చేస్తే నిందితుడి పక్కన పోలీసులెందుకు లేరు? పోలీసు వాహనంలో ఎందుకు తీసుకొనిరాలేదు? ఠాణాలో రిపోర్ట్ చేసి దవాఖానకు, అక్కడి నుంచి జైలుకెందుకు తీసుకొనిపోలేదు? నిందితుడి వెంట బీజేపీ లాయర్లు ఎందుకు ఉన్నారు? నాకాబందీ బందోబస్తు ప్రణాళిక చూపండి.. ఆ బృందంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో వెల్లడించండి. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆయన జీవితమంతా అబద్ధాల చరిత్రే.
-ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
రేవంత్‌రెడ్డీ… కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కాపాడాలని ప్రధాని మోదీ మొన్నటి సభలో మీకు చెప్పలేదా? దేవుడి గుడిలో ప్రమాణానికి సిద్ధమా?
-ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్