హైదరాబాద్, జూలై 29 (నమస్తేతెలంగాణ) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అ నారోగ్యానికి కాంగ్రెస్ సర్కార్ కక్షపూరిత రాజకీయాలే కారణమని బీఆర్ఎస్ ప్రధాన కార్యద ర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక పేరిట బీఆర్ఎస్ నేతల భద్రతను కుదిస్తూ ప్రభుత్వ కుట్రలు చే స్తున్నదని, పెద్ది సహా పలువురు బీఆర్ఎస్ నేతల పై కాంగ్రెస్ కక్షగట్టిందని ఆయన విమర్శించారు. తెలంగాణభవన్‌లో బుధవారం బీఆర్ఎస్ సీనియర్ నేతలు బొమ్మెర రామ్మూర్తి, గౌండ్ల నాగేందర్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్, అబ్రార్ అహ్మద్, నాగరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 20 ఏండ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి 25 ఏండ్లుగా సెక్యూరిటీతోపాటు లైసెన్స్డ్ గన్ ఇచ్చి రక్షణ కల్పించారని గుర్తుచేశారు. ప్రజాఉద్యమాల్లో చురుగ్గా పా ల్గొని నక్సల్స్‌కు టార్గెట్‌గా మారినందునే ఏ ప్రభుత్వమున్నా భద్రతను కల్పించిందని చెప్పారు.
కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన త ర్వాత సుదర్శన్‌రెడ్డి గన్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా, గన్మెన్లను తొలగించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పాలనలో రూ.1,100 కోట్ల సివిల్ సైప్లె స్కా మ్ను పెద్ది సుదర్శన్‌రెడ్డి వెలుగులోకి తెచ్చారు. బంకర్బెడ్ల స్కామ్‌ను ఆధారాలతో బట్టబయలు చేశారు. విచారణ జరిపించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించా రు’ అని గుర్తుచేశారు. ఈ కక్షతోనే భద్రతను తొలగించి ప్రభుత్వం ఒత్తిడికి గురిచేసిందని తెలిపారు. ‘వట్టినాగులపల్లిలోని వాసవీ బిల్డర్స్‌కు పలువురు నర్సంపేట వ్యాపారులు విక్రయించిన భూమిపై సీఎం ముఖ్య అనుచరుడు ఫహీంఖురేషీ కన్నుపడ్డది. ఆ వ్యాపారులపై కేసులు పెట్టిం చి అందులో పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఇరికించేందుకు ఖురేషీ యత్నించారు. ఈ పరిస్థితుల్లోనే పెద్ది గుండెపోటుకు గురయ్యా రు’ అని వివరించారు. ప్రాణాపాయ పరిస్థితు ల్లో కొట్టుమిట్టాడుతున్న సుదర్శన్‌రెడ్డి, గుండెలవిసేలా విలపిస్తున్న ఆయన భార్యాపిల్లలను చూసి గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఏ హోదా ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డికి అత్యాధునిక ఇజ్రాయెల్, టర్కీ ఆయుధాలతో రక్షణ కల్పిస్తున్నారని ప్రవీణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కొ డంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ఎందుకు భద్రత కల్పించడం లేదని నిలదీశా రు. అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదులతో ముప్పు ఉ న్నదని మైనంపల్లి హన్మంతరావు, కొండా ముర ళి, తూర్పు జగ్గారెడ్డికి గన్మెన్లను ఇచ్చారా? ఏం పదవి ఉన్నదని జానారెడ్డి ఇంటివద్ద సెక్యూరిటీ గార్డులను కాపలా ఉంచారు?’ అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. భద్రతను కల్పించడంలో కాంగ్రెస్ వారికి ఓ న్యాయం.. బీఆర్ఎస్ నేతలకు మరో న్యాయమా? అని సూటిగా నిలదీశారు.
ఏ పదవి, హోదా లేని, ఎలాంటి ముప్పులేని కాంగ్రెస్ నాయకులకు రక్షణ కల్పించడం.. ము ప్పు ఉన్న బీఆర్ఎస్ నేతలకు భద్రతను తొలగించడంపై.. సెక్యూరిటీ అనేది హాదా కోసం కాదని చెప్పే డీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘బీఆర్ఎస్కు చెందినందునే తనతోపాటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, మాజీ ఎంపీ మాలోత్ కవిత, జైపాల్‌యాదవ్ గన్మెన్లను తొలగించారు. కానీ కాంగ్రెస్‌కు చెందిన ఇంద్రకరణ్‌రెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌తోపాటు బీజేపీకి చెందిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, తల్లోజు ఆచారికి గన్మెన్లతో భద్రత కల్పించారు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులవే ప్రాణాలు.. కానీ, బీఆర్ఎస్ నాయకులవి కావా? అని ప్రశ్నించారు. నేతలకు భద్రత కల్పించడంలోనూ కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం స్పష్టంగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. యాదాద్రి బోర్డు సభ్యురాలైన ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత శ్రీచరణ్రెడ్డికి ఇద్దరు గన్మెన్లతో భద్రత కల్పించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
దేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మంత్రులు బుల్లెట్‌ప్రూఫ్ వా హనాలు వినియోగించడం లేదని ప్రవీణ్ గుర్తుచేశారు. కానీ, తెలంగాణలోని మాత్రం మంత్రులతోపాటు మాజీ మంత్రి జానారెడ్డికి కూడా బు ల్లెట్ప్రూఫ్ కార్లను ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. లోపభూయిష్టమైన సెక్యూరిటీ రివ్యూ కమిటీని వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.