RS Praveen Kumar | 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులకు కేవలం 2,692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులేనా..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | హైదరాబాద్ : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చాలా మంది బీఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. అయితే దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులకు కేవలం 2692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ప్రకటించడం అన్యాయమన్నారు.
RS Praveen Kumar | హైదరాబాద్ : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చాలా మంది బీఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. 11,062 పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులకు కేవలం 2692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ నిర్వహించిందని, మీరు ఏటా రెండు సార్లు చేపట్టాలని ప్రవీణ్ కుమార్ కోరారు. నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చిన కొన్ని అంశాలను సీఎం రేవంత్ ముందు ఉంచి, వాటిని పరిశీలించాలని కోరారు.
సీఎం రేవంత్ ముందు ఉంచిన అంశాలు ఇవే..
1. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీఎడ్ (BEd) అభ్యర్థులకు ఎస్జీటీ (SGT) పోస్టులకు అర్హత లేనట్లే. ఈ లెక్కన కొత్త BEd కాలేజీ లకు అనుమతి ఇవ్వక పోవడం మంచిది.
2. బీఎడ్ చేసిన వారు పాఠశాల విద్యా శాఖలో కేవలం స్కూల్ అసిస్టెంటుకు మాత్రమే అర్హులు. వాళ్ల సంఖ్య దాదాపుగా నాలుగు లక్షలు ఉన్నది. కాని కేవలం 2629 పోస్టులే ప్రకటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నయి. ఈ పోస్టులు ఎలాగైనా పెంచే విధంగా చూడగలరు.
3. గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ (TET) నిర్వహించింది. నిజానికి టెట్ సంవత్సరానికి రెండు పర్యాయాలు నిర్వహించాలి. ఈ సారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేయడం చేస్తే బాగుంటుంది. లేదా టెట్, డీఎస్సీ రెండూ ఒకే సారి కూడా చేస్తే చాలా మందికి అర్హత వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ కాబట్టి పెద్దగా సమస్య ఉండక పోవచ్చు.
4. ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంటు ప్రమోషన్లలో నిష్పత్తి ప్రస్తుతం 70:30 ఉంది. అంటే 70 శాతం పదోన్నతి, 30 శాతం డైరెక్టు రిక్రూట్మెంట్. దీని వల్ల బీఎడ్ (BEd) అభ్యర్థులకు పోస్టులు తక్కువ కావడమే కాకుండా సంస్థలో vitality దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని గురుకులాల్లో లాగా ఈ నిష్పత్తిని 50:50 లాగా సర్వీసు రూల్స్‌ను మారిస్తే అందరికీ లాభమైతది.
5. చాలా కాలంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆగి పోయింది. వీళ్లను ఎంత అర్జంటుగా రిక్రూట్ చేస్తే (ప్రతి స్కూల్‌కు ఒకరు) అంత మంది తెలంగాణ బిడ్డలు సృజనాత్మకంగా,ఆరోగ్యంగా తయారవుతారు.
6. పాఠశాలల్లో మానసిక నిపుణులను (కౌన్సిలర్లు) ను నియమిస్తే తప్పకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గి ఆత్మహత్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది.
7. డీఎస్సీ 2008 అభ్యర్థులు న్యాయం కోసం తొక్కని గడప లేదు. వారికి పక్క రాష్ట్రంలో న్యాయం జరిగింది. మన దగ్గర కూడా వాళ్ల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయగలరు.
8. గురుకులం ఆశావహులు బ్యాక్ లాగ్ ఖాళీలను ఎలాగైనా నివారించేందుకు ‘అవరోహణ క్రమంలో’ రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రభుత్వం నుండి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు.
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి @revanth_anumula గారికి,
మీరు మెగా డీయస్సీ పేరుతో దాదాపు 11,000 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఈ వార్త చాలా మంది బీఎడ్ (BEd) అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిలించింది. దాదాపు గా నాలుగు లక్షల మందికి కేవలం 2629 స్కూల్… pic.twitter.com/o3tbstdyzc— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) February 29, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

