హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యదర్శి స్మితాసబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మిషన్ భగీరథకు రాష్ట్ర మార్జిన్ మనీ కింద ఈ మొత్తాన్ని విడుదలచేసినట్టు పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు రూ.5 కోట్లను విడుదలచేస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు.