Vishwambhara Movie | మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్లో రాబోతున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ కార్డ్స్ విషయంలో దర్శకుడు వశిష్ట తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘లియో’ సినిమా తర్వాత యానిమేటెడ్ టైటిల్ కార్డ్స్ వేయడం అనేది ఒక ట్రెండ్‌గా మారిపోయిందన్న సంగతి తెలిసిందే, అయితే తన సినిమా కోసం ఆ రొటీన్ ఫార్ములాను ఫాలో అవ్వడం తమకు ఇష్టం లేదని వశిష్ట క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ ‘విశ్వంభర’ కాన్సెప్ట్‌ను ప్రతిబింబించేలా ఏకంగా ఎనిమిది రకాల ప్రత్యేకమైన మెగాస్టార్ టైటిల్ కార్డ్ డిజైన్స్‌ను చిత్ర బృందం రూపొందించినట్లు తెలుస్తుంది. పంచభూతాల నేపథ్యంలో సాగే ఈ ఫాంటసీ అడ్వెంచర్‌లో ప్రతి టైటిల్ కార్డ్ ఒక ప్రత్యేకమైన ఎలిమెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో, చిరంజీవి గారి ఇమేజ్ను మరో లెవల్లో చూపిస్తూ ఈ కార్డ్స్ డిజైన్ చేయబడ్డాయి. కేవలం టైటిల్ కార్డ్స్ కోసమే దర్శకుడు ఇంతటి కసరత్తు చేశారంటే, వెండితెరపై సినిమా ఏ స్థాయి విజువల్ వండర్‌గా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.