లోక్ అదాలత్‌తో 45.21 కోట్ల రీఫండ్
జాతీయ లోక్ అదాలత్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా రూ.45.21 కోట్లు సైబర్ నేరాల బాధితులకు రీఫండ్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ, బ్యాంకులు, డిజటల్ పేమెంట్ల ప్రొవైడర్లు, రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా పోలీస్ యూనిట్ల సమన్వయంతో ఈ రీఫండ్‌ను చేపట్టినట్లు పేర్కొన్నారు.
- సైబర్ నేరాల్లో బాధితులకు ఊరట : డీజీ శిఖాగోయెల్
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : జాతీయ లోక్ అదాలత్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా రూ.45.21 కోట్లు సైబర్ నేరాల బాధితులకు రీఫండ్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ, బ్యాంకులు, డిజటల్ పేమెంట్ల ప్రొవైడర్లు, రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా పోలీస్ యూనిట్ల సమన్వయంతో ఈ రీఫండ్‌ను చేపట్టినట్లు పేర్కొన్నారు. లోక్‌అదాలత్ ద్వారా 6,303 మంది బాధితులకు రూ.45.21 కోట్లు అందించి వారికి ఆర్థిక ఉపశమనం కల్పించినట్లు తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 2,232 మందికి రూ.21.91 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి 77 మందికి రూ.6.83 కోట్లు, మలాజిగిరి నుంచి 779 మందికి రూ.4.04 కోట్లు, హైదరాబాద్ నుంచి 755 మందికి రూ.3.22 కోట్లు, సంగారెడ్డి నుంచి 167 మంది బాధితులకు రూ.1.69 కోట్లు రీఫండ్ చేసినట్టు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన లోక్ అదాలత్‌ల ద్వారా 59,953 మంది బాధితులకు మొత్తం రూ.445.41 కోట్లు తిరిగి ఇప్పించినట్టు వెల్లడించారు. 2023లో రూ. 8.36 కోట్లు, 2024లో రూ.183.9 కోట్లు, 2025లో రూ.182.9 కోట్లు, 2026 జూన్ 20 వరకు రూ.70.07 కోట్లు రీఫండ్ చేశామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

