హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా 20 ప్రదేశాల్లో నిర్వహించిన సోదాల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వెల్లడించింది.
ఏపీతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో రూ.38 లక్షలతోపాటు బోగస్ ఇన్వాయిస్, రవాణా చలాన్లు, నిందితుల చాటింగ్ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. దుబాయ్లో తలదాచుకున్న ట్టు అనుమానిస్తున్న నిందితుల కీలక ఆధారాలు దొరికాయని తెలిపింది.