Habits That Damage Kidneys | మనం తీసుకునే ఆహారంపైనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే శరీరంలోని అవయవాలతో సహా మొత్తం శరీరానికి మేలు కలుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారం శరీరంలోని అవయవాలకు హానిని కలిగిస్తుంది. మనం తీసుకునే ఆహారం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ది చేసి అందులో ఉండే విష పదార్థాలను బటయకు పంపిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే మొత్తం శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం తీసుకునే ఆహారాలు కొన్ని మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించడంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి. మూత్రపిండాల ఆరోగ్యానికి హానిని కలిగించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జంక్‌ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. వీటిలో ఉప్పుతో పాటు ఫ్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన ఆహారాలు, పిజ్జా వంటివి మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు తగ్గుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవుతుంది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది. కనుక మాంసాన్ని కూడా తక్కువగా తీసుకోవాలి. అదే విధంగా చక్కెర పానీయాలు, తీపి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. తీపి పదార్థాలు రక్తంలో చక్కెరను పెంచుతాయి. రక్తంలో ఎక్కువగా ఉండే చక్కెర స్థాయిలు మూత్రపిండాలకు హానిని కలిగిస్తాయి.
వీటితో పాటు మనలో చాలా మంది సాసేజ్లు, బేకన్, ప్యాక్ చేసిన మాంసం, ప్రాసెస్ చేసిన, డీప్ ఫ్రై ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు బీపీ, ఊబకాయం వంటి ఇతర అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి. ఇవన్నీకూడా మూత్రపిండాల ఆరోగ్యానికి హానికరం. కనుక ఈ ఆహారాలను తీసుకోవడం చాలా వరకు తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆహారాలకు బదులుగా మూత్రపిండాలకు మేలు చేసే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు వంటి వాటిని తీసుకోవాలి. సమతుల్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. రోజూ 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు అదుపులో ఉండేలా జాగ్రత్త వహించాలి. దీని వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా ఉంటుంది. మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా సరైన ఆహారం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.