IND vs AFG | అరోన్ జార్జి సెంచరీ.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్.. ఆఫ్ఘన్పై ఘన విజయం
IND vs AFG : అండర్ 19 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్పై బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఘన విజయం నమోదు చేసింది.
IND vs AFG : అండర్ 19 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్పై బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఘన విజయం నమోదు చేసింది. అరోన్ జార్జి సెంచరీతో చెలరేగగా.. వైభవ్ సూర్యవంశీ దూకుడైన అర్ధసెంచరీతో భారీ విజయ లక్ష్యాన్ని ఇండియా సునాయాసంగా చేధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచులో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇద్దరు సెంచరీలు సాధించారు. ఫైజల్ షినోజోదా 110 పరుగులు (93 బంతుల్లో 15 ఫోర్లు), ఉజైరుల్లా 101 పరుగులు, నాటౌట్ (86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు)తో ఆకట్టుకున్నారు. తర్వాత ఉస్మాన్ సాదత్ 39 పరుగులు, ఖలీద్ అహ్మద్జాయ్ 31 పరుగులు సాధించారు. ఇండియన్ బౌలర్లలో కనిష్క్ చౌహాన్, దీపేశ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 311 పరుగుల భారీ లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్ అరోన్ జార్జ్ 115 పరుగులు (104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లు)తో చెలరేగిపోయాడు. తర్వాత వైభవ్ సూర్యవంశీ 62 పరుగులు (33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు.
ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా 62 పరుగులు (59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు)తో అదరగొట్టాడు. అలాగే విహాన్ మల్హోత్రా కూడా 38 పరుగులతో రాణించారు. భారత బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో 41.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ నెల 6, శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఈ తుదిపోరు ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

