షాబాద్/ హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెక్కు అందజేయగా ఆయన అభినందించారు. అనంతరం అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ, కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డితోపాటు పార్టీ నాయకుడు పట్నం సురేందర్‌రెడ్డి, కార్యకర్తలతో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.