హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): మూడెకరాల వరకున్న రైతులకు బుధవారం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని జమచేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9.56 లక్షల మంది రైతులకు 20.51 లక్షల ఎకరాలకు రూ.1,230.98 కోట్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు రూ.3,487.82 కోట్లను 58.13 లక్షల ఎకరాలకు గాను మొత్తంగా 44.82 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ఈ పెట్టుబడి సాయాన్ని రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. మిగతా వారికీ త్వరలోనే జమ చేస్తామని పేర్కొన్నారు.
‘భరోసా’పై ఏవోను నిలదీసిన రైతు
కొల్లాపూర్, ఫిబ్రవరి 12 : ఎకరంలోపు ఉన్న రైతుల్లో చాలామందికి రైతు భరోసా డబ్బులు జమ కాలేదని రైతులే చెప్తున్నారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చింతపల్లికి చెందిన ఓ రైతు మండల వ్యవసాయ అధికా రి కార్యాలయానికి వచ్చి అధికారుల ను నిలదీశాడు. ‘రైతు భరోసా సా యం అందలేదు. మీరే ఆ పైసలు వే స్తలేరు’ అని అధికారితో వాగ్వాదానికి దిగాడు. దీనికి పెట్టుబడి సా య ం డబ్బులు కొందరికి ఎందుకు పడలేదో తనకే అర్థం కావడం లేదని సద రు అధికారి సర్దిచెప్పాడు. రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నామని పలువురు ఏవోలు పేర్కొంటున్నారు.