గోవిందరావుపేట, సెప్టెంబర్ 12 : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో రెండు అంగన్వాడీ సెంటర్ల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కుళ్లిపోయిన కోడిగుడ్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్ శారద, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరిని వివరణ కోరగా..
కుళ్లిపోయిన కోడిగుడ్ల విషయమై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. రెడ్ స్టాంప్తో ఉన్న కోడిగుడ్లను ఈ నెల 2న సెంటర్ ద్వారా లబ్ధిదారులకు అందించామని తెలిపారు. సూపర్వైజర్ శారద గ్రామంలో విచారణ చేపట్టారు.