రవీంద్రభారతి, ఆగస్టు 1 : రాష్ట్రంలోని 40 లక్షల మంది మాల సమాజానికి అన్యాయం చేసే రోస్టర్ విధానాన్ని సవరించకపోతే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ మాల సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మాందాల భాస్కర్, గౌరవాధ్యక్షుడు చెరుకు రాంచందర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సం ఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న) మాట్లాడారు.
ఆగస్టు 1 మాలలకు బ్లాక్ డే అని పేర్కొన్నారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట అంబేద్కర్ విగ్రహాల వద్ద మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనలో వేలాదిమంది పాల్గొనాలని కోరారు. మందకృష్ణమాదిగతో సీఎం రేవంత్ కుమ్మ క్కై మాల సమాజానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. మంత్రి వర్గంలోని మాల మంత్రులు, ఎమ్మెల్యేలు రోస్టర్ విధానాన్ని రద్దు చేయించాలని, లేకుంటే వారి పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.