తాండూరు, ఏప్రిల్ 1: ప్రభుత్వ నిధులతో కాంగ్రెస్ నాయకుడి ఫామ్‌హౌస్‌కు రోడ్డు వే యడం విమర్శలకు దారితీసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకున్నది. తాండూరులోని 11వ వార్డుల్లో కోకట్ గ్రామ పంచాయతీ డీఎంఎఫ్టీ రూ.60 లక్షల నిధులతో కాంగ్రెస్ నాయకుడి ఫాంహౌస్‌కు సీసీ రోడ్డు వేశారు. డీఎంఎఫ్టీ నిధులు పట్టణ అవసరాలకు కాకుండా కొంద రు వ్యక్తులు, అనుమతి లేని వెంచర్ల యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేలా పనులు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. కోకట్ పంచాయతీతోపాటు తాండూరులోని అనేక వార్డు ల్లో సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే పాలకులు ఇలా ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు సంబంధిత అధికారులు వెంటనే ఈ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.