Telangana DGP | రోడ్డు భద్రత మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలి : డీజీపీ రవిగుప్తా ఆదేశాలు
Telangana DGP | కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో రోడ్డు భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని డీజీపీ రవిగుప్తా (DGP Ravigupta) జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో రోడ్డు భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించి, విజయవంతం చేయాలని డీజీపీ రవిగుప్తా (DGP Ravigupta) జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(Video Confrence) లో ఆయన మాట్లాడారు. జనవరి 15వ తేదీ నుంచి మొదలైన మాసోత్సవాలు ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతాయని అన్నారు.
2022 సంవత్సరంలో తెలంగాణలో 7, 500 మంది రోడ్డు ప్రమాదాల్లో ( Road Accidents) చనిపోగా, భారత్‌లో 1,68,000 మంది చనిపోయారని వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత (Youth) మృత్యువాత పడడం బాధాకరమని అన్నారు. రోడ్డు ప్రమాదాలను ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ద్వారా నివారించవచ్చని పేర్కొన్నారు.
రహదారులు ఉండే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్బుల (Road safety clubs) ను ఏర్పాటు చేయాలని, పోలీస్ కార్యాలయాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ బ్యూరో , కమిషనరేట్ లలో కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఈ చలాన్ నిధుల ద్వారా స్పీడ్ గన్స్, బ్రీత్ అనలైజర్స్ వంటి వాటిని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి ‘ గుడ్ సమారిటన్’ పేరిట సన్మానం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ , రోడ్డు భద్రత, రైల్వేల విభాగపు అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ , హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఐజీ రంగనాథ్, రోడ్ సేఫ్టీ ఎస్పీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

