సీసీఐ భూనిర్వాసితుల రాస్తారోకో
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్లో సిమెంటు పరిశ్రమ ఏర్పడితే
ఆదిలాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్లో సిమెంటు పరిశ్రమ ఏర్పడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని గతంలో తాము తక్కువ ధరకు భూములను విక్రయించామని, కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా పరిశ్రమను మూసివేయడంతో తాము నష్టపోయినట్టు సీసీఐ భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు అరవింద్ తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీసీఐని అమ్మడానికి నిర్ణయం తీసుకున్నందున యంత్ర సామగ్రి వేలం వేస్తున్నట్టు తెలిపారు. గతంలో తాము ఇచ్చిన భూముల ధరలు ఇప్పుడు ఎకరానికి రూ. కోటి పలుకుతున్నాయని, భూముల అమ్మకంతో కేంద్ర ప్రభుత్వం డబ్బులు దండుకోవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూములను ఇచ్చి నష్టపోయిన తమకు తిరిగి భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వేలం ప్రక్రియను నిలిపివేసి పరిశ్రమను పునః ప్రారంభించాలని కోరారు. సీసీఐని పునఃప్రారంభించేంత వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

